అధ్యాయములు:
1దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును
2నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కని పెట్టియున్నాను. నీళ్లు లేకయెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది.
3నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును.
4నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు
5క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానము చేయుచున్నది
6కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను నీ నామమునుబట్టి నా చేతులెత్తెదను.
7నీవు నాకు సహాయకుడవై యుంటివి నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను.
8నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది.
9నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాని వెదకుచున్నారు వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు
10బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు నక్కలపాలగుదురు.
11రాజు దేవునిబట్టి సంతోషించును. ఆయనతోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును అబద్ధములాడువారి నోరు మూయబడును.