యోబు 17వ అధ్యాయము

అధ్యాయములు:

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42

1నా ప్రాణము సమసిపోయెను నా దినములు తీరెను…సమాధి నా నిమిత్తము సిద్ధమైయున్నది.
2ఎగతాళి చేయువారు నాయొద్ద చేరియున్నారువారు పుట్టించు వివాదములు నా కన్నుల కెదురుగానున్నవి.
3ఏర్పాటు చేయుము దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుముమరి యెవడు నా నిమిత్తము పూటపడును?
4నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగుచేసితివికావున నీవు వారిని హెచ్చింపవు.
5ఎవడు తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చునోవాని పిల్లల కన్నులు క్షీణించును.
6ఆయన నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసి యున్నాడునలుగురు నా ముఖముమీద ఉమి్మవేయుదురు.
7నా కనుదృష్టి దుఃఖముచేత మందమాయెనునా అవయవములన్నియు నీడవలె ఆయెను
8యథార్థవంతులు దీనినిచూచి ఆశ్చర్యపడుదురునిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు.
9అయితే నీతిమంతులు తమ మార్గమును విడువకప్రవర్తించుదురునిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు.
10మీరందరు నాయొద్దకు రండి, మరల దయచేయుడిమీలో జ్ఞానవంతు డొక్కడైనను నాకు కనబడడు.
11నా దినములు గతించెనునా యోచన నిరర్థకమాయెనునా హృదయ వాంఛ భంగమాయెను.
12రాత్రి పగలనియుచీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు.
13ఆశ యేదైన నాకుండిన యెడల పాతాళము నాకుఇల్లు అను ఆశయే.చీకటిలో నా పక్క పరచుకొనుచున్నాను
14నీవు నాకు తండ్రివని గోతితోనునీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోను నేనుమనవి చేయుచున్నాను.
15నాకు నిరీక్షణాధారమేది?నా నిరీక్షణ యెవనికి కనబడును?
16ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ములయొద్దకు దిగుచున్నది.