అధ్యాయములు:
1ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;
2మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను.
3ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను.
4షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిదివందల ఏండ్లు; అతడు కుమారులను కుమార్తెలను కనెను.
5ఆదాము బ్రదికిన దిన ములన్నియు తొమి్మదివందల ముప్పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
6షేతు నూట అయిదేండ్లు బ్రదికి ఎనోషును కనెను.
7ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిదివందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
8షేతు బ్రదికిన దిన ములన్నియు తొమి్మదివందల పండ్రెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
9ఎనోషు తొంబది సంవత్సరములు బ్రదికి, కేయినానును కనెను.
10కేయినానును కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
11ఎనోషు దినములన్నియు తొమి్మదివందల అయి దేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
12కేయినాను డెబ్బది యేండ్లు బ్రదికి మహలలేలును కనెను.
13మహలలేలును కనినతరువాత కేయినాను ఎనిమిది వందల నలువది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
14కేయినాను దినములన్నియు తొమి్మదివందల పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
15మహలలేలు అరువది యైదేండ్లు బ్రదికి యెరెదును కనెను.
16యెరెదును కనినతరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పదియేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
17మహలలేలు దినములన్నియు ఎనిమిదివందల తొంబదియైదేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
18యెరెదు నూట అరువది రెండేండ్లు బ్రదికి హనోకును కనెను.
19హనోకును కనిన తరువాత యెరెదు ఎనిమిది వందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
20యెరెదు దినములన్నియు తొమి్మదివందల అరువదిరెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
21హనోకు అరువది యైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను.
22హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందలయేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తె లను కనెను.
23హనోకు దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు.
24హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.
25మెతూషెల నూట ఎనుబదియేడేండ్లు బ్రదికి లెమెకును కనెను.
26మెతూషెల లెమెకును కనిన తరువాత ఏడు వందల ఎనుబది రెండేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
27మెతూషెల దినములన్నియు తొమి్మదివందల అరువది తొమి్మదియేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
28లెమెకు నూట ఎనుబది రెండేండ్లు బ్రదికి ఒక కుమా రుని కని
29భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయము లోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు
30లెమెకు నోవహును కనిన తరువాత ఏనూట తొంబదియైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
31లెమెకు దినములన్నియు ఏడువందల డెబ్బది యేడేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
32నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.